Breaking News

హరియాణా స్టీలర్స్‌ దూకుడు

Published on Sat, 11/30/2024 - 04:05

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న హరియాణా స్టీలర్స్‌... లీగ్‌లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్‌ 42–30తో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్టీలర్స్‌ ఓవరాల్‌గా 23 రెయిడ్‌ పాయింట్లు, 13 ట్యాకిల్‌ పాయింట్లు సాధించింది. ప్రత్యరి్థని రెండుసార్లు ఆలౌట్‌ చేయడం ద్వారా మరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

స్టీలర్స్‌ తరఫున వినయ్‌ (9 పాయింట్లు), నవీన్‌ (6 పాయింట్లు), రాహుల్‌ (6 పాయింట్లు) రాణించారు. తలైవాస్‌ తరఫున మోయిన్‌ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన స్టీలర్స్‌ 12 విజయాలు, 3 పరాజయాలతో 61 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 14 మ్యాచ్‌లాడిన తలైవాస్‌ 5 విజయాలు, 8 పరాజయాలు, ఒక ‘టై’తో 33 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 34–33తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచింది. 

పల్టన్‌ తరఫున ఆకాశ్‌ షిండే 12 పాయింట్లతో అదరగొట్టగా... గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున గుమన్‌ సింగ్‌ 16 పాయింట్లతో పోరాడినా లాభం లేకపోయింది. తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 47 పాయింట్లతో పల్టన్‌ మూడో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరెట్స్‌తో బెంగళూరు బుల్స్‌ (రాత్రి 8 గంటలకు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.   

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)