Breaking News

ప్లే ఆఫ్స్‌లో స్టీలర్స్‌

Published on Thu, 12/12/2024 - 03:58

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా హరియాణా స్టీలర్స్‌ నిలిచింది. బుధవారం జరిగిన పోరులో స్టీలర్స్‌ 37–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 15 విజయాలు, 4 పరాజయాలతో 77 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ‘ప్లే ఆఫ్స్‌’లో చోటు ఖాయం చేసుకుంది. 

బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో స్టీలర్స్‌ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. హరియాణా తరఫున వినయ్‌ 9 పాయింట్లు, శివమ్‌ 8 పాయింట్లతో సత్తా చాటగా... మొహమ్మద్‌ రెజా 6 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్‌ తరఫున జతిన్‌ (5 పాయింట్లు) కాస్త పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్‌ 21 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... బెంగళూరు 14 రెయిడ్‌ పాయింట్లకే పరిమితమైంది. 

మరోవైపు ఈ సీజన్‌లో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలు, 15 పరాజయాలు, ఒక ‘టై’తో 19 పాయింట్లతో ఉన్న బెంగళూరు బుల్స్‌... పట్టిక అట్టడుగున (12వ స్థానంలో) కొనసాగుతోంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 47–31 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. లీగ్‌లో భాగంగా గురువారం దబంగ్‌ ఢిల్లీతో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటలకు), యూపీ యోధాస్‌తో బెంగాల్‌ వారియర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)