Breaking News

టైటిల్‌ పోరుకు హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్‌

Published on Sat, 12/28/2024 - 04:04

పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా స్టీలర్స్‌ 28–25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. తాజా సీజన్‌లో తిరుగులేని ఆధిపత్యంతో గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన హరియాణా స్టీలర్స్‌ సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి హరియాణా 12–11తో ముందంజలో నిలిచింది. 

ద్వితీయార్ధంలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి స్టీలర్స్‌ తుదిపోరుకు చేరింది. హరియాణా తరఫున శివమ్‌ పతారె 7, వినయ్‌ 6 రెయిడ్‌ పాయింట్లు సాధించారు. రాహుల్‌ సత్పాల్‌ (5 పాయింట్లు) ట్యాక్లింగ్‌లో అదరగొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్‌ 15 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్‌ 18 రెయిడ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

అయితే డిఫెన్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన స్టీలర్స్‌ ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్‌ చేయడంతో పాటు మరో రెండు ఎక్స్‌ట్రా పాయింట్లు సాధించి ముందంజ వేసింది. యూపీ యోధాస్‌ తరఫున స్టార్‌ రెయిడర్‌ గగన్‌ గౌడ 10 పాయింట్లతో పోరాడగా... భవానీ రాజ్‌పుత్, హితేశ్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరెట్స్‌ 32–28 పాయింట్ల తేడాతో మరో మాజీ చాంపియన్‌ దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది.

ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖర్లో ఒత్తిడిని అధిగమించిన పైరేట్స్‌ విజయతీరానికి చేరింది. పట్నా తరఫున దేవాంక్, అయాన్‌ చెరో 8 పాయింట్లు సాధించగా... శుభమ్‌ షిండే (5 పాయింట్లు), అంకిత్‌ (4 పాయింట్లు) రాణించారు. ఢిల్లీ జట్టు తరఫున అశు మలిక్‌ (9 పాయింట్లు), మోహిత్‌ దేశ్వాల్‌ (7 పాయింట్లు) పోరాడారు. ఆదివారం జరగనున్న తుదిపోరులో హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్‌ తలపడనుంది.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)