Breaking News

సెమీస్‌లో హరియాణా, ఛత్తీస్‌గఢ్‌

Published on Sun, 08/10/2025 - 04:30

సాక్షి, కాకినాడ: జూనియర్‌ మహిళల జాతీయ హాకీ చాంపియన్‌షి ప్‌లో హరియాణా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్‌ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో హరియాణా 4–1తో ఒడిశాపై ఘనవిజయం సాధించింది. హరియాణా జట్టులో కాజల్‌ (2వ ని.), సుప్రియా (27వ ని.), శశి ఖాస (36వ ని.), సాది (60వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. ఒడిశా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అమిషా ఎక్కా 47వ నిమిషంలో సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ 2–1తో పెనాల్టీ షూటౌట్‌లో  మధ్య ప్రదేశ్‌పై గెలిచింది. 

నిర్ణీత సమయంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి యశోద (2వ ని.), మధ్యప్రదేశ్‌ తరఫున హుడా ఖాన్‌ (15వ ని.) గోల్‌ చేయడంతో 1–1తో డ్రా అయింది. మరో క్వార్టర్స్‌లో జార్ఖండ్‌ 3–1తో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్‌ జట్టులో పవన్‌ప్రీత్‌ కౌర్‌ (6వ ని.) గోల్‌ చేయగా, జార్ఖండ్‌ జట్టులో స్వీటి డంగ్‌డంగ్‌ (7వ ని), శాంతి కుమారి (22వ ని.), రోషిణి ఐంద్‌ (46వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. ఆఖరి క్వార్టర్‌ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్‌ 2–1తో మహారాష్ట్రపై నెగ్గింది. యూపీ తరఫున సల్లు పుఖ్రంబమ్‌ (36వ ని.), రష్మీ పటేల్‌ (55వ ని.) చెరో గోల్‌ చేయగా, మహారాష్ట్ర జట్టులో దీక్షా షిండే (45వ ని.) ఒక గోల్‌ సాధించింది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు