Breaking News

చరిత్ర సృష్టించిన హర్షిత్‌ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా

Published on Fri, 02/07/2025 - 07:30

నాగ్‌పూర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో సకీబ్‌ మహమూద్‌, రషీద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెతల్‌, అర్చర్‌ చెరో వికెట్‌ను సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది.

కెప్టెన్ జోస్‌ బట్లర్‌ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్‌ బెతెల్‌ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్‌ సాల్ట్‌ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్‌(32) దూకుడగా ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు షమీ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

చరిత్ర సృష్టించిన రాణా..
ఇక ఈ మ్యాచ్‌తో భారత తరపున వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్‌ హర్షిత్‌ రాణా(Harshit Rana) పర్వాలేదన్పించాడు. అయితే తన మొదటి మూడు ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్‌ జట్టు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ డకెట్‌ ఊతికారేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌​ ఐదువ ఓవర్‌ వేసిన రాణా.. ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు.

కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్‌ స్పీడ్‌ స్టార్‌ అద్భుతమైన కమ​్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్లు బెన్‌ డకెట్‌, హ్యారీ బ్రూక్‌లను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్‌గా  ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన రాణా.. 53 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. 

ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. కాగా రాణా తన టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లండ్‌పైనే చేశాడు. 

పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో రాణా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాణా 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే రాణా ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే అరంగేట్రంలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా రాణా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాణా ఒకే ఓవర్‌లో ఏకంగా 26 పరుగులిచ్చాడు.
చదవండి: శుబ్‌మన్, శ్రేయస్‌ సత్తా చాటగా...

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)