Breaking News

చ‌రిత్ర సృష్టించిన హర్షల్ పటేల్‌.. ఐపీఎల్‌లో హిస్టరీలోనే

Published on Mon, 05/19/2025 - 22:24

టీమిండియా వెట‌ర‌న్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ( బంతులు ప‌రంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌల‌ర్‌గా హ‌ర్ష‌ల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను ప‌టేల్ అందుకున్నాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త‌ను ప‌టేల్ న‌మోదు చేశాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గ‌జం ల‌సిత్ మ‌లింగ‌(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మ‌లింగ రికార్డును హ‌ర్ష‌ల్ ప‌టేల్ బ్రేక్ చేశాడు. ఓవ‌రాల్‌గా మ్యాచ్‌లు ప‌రంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హ‌ర్ష‌ల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మ‌లింగ‌(105) కొన‌సాగుతున్నాడు.

ఐపీఎల్‌లో బంతులు ప‌రంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..
2381- హర్షల్ పటేల్
2444- లసిత్‌ మలింగ
2543- చాహల్
2656- డ్వైన్‌ బ్రావో
2832- జ‌స్ప్రీత్ బుమ్రా

మ్యాచ్‌ల ప‌రంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..
లసిత్ మలింగ- 105
హర్షల్ పటేల్- 117
యుజ్వేంద్ర చాహల్-118
రషీద్ ఖాన్- 122
జస్ప్రీత్ బుమ్రా- 124
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)