Breaking News

చ‌రిత్ర సృష్టించిన హర్షల్ పటేల్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా

Published on Mon, 05/27/2024 - 20:19

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజ‌న్ ముగిసింది. ఈ ఏడాది సీజ‌న్ విజేత‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిలిచింది. 

ఇక ఇది ఇలా ఉండ‌గా ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఓపెన‌ర్‌ విరాట్ కోహ్లి నిల‌వ‌గా.. ప‌ర్పుల్ క్యాప్ హోల్డ‌ర్‌గా పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ నిలిచాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హ‌ర్ష‌ల్‌.. 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఈ క్ర‌మంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో రెండు సార్లు ప‌ర్పుల్ క్యాప్‌ను అవార్డును సొంతం చేసుకున్న మూడో క్రికెట‌ర్‌గా హ‌ర్ష‌ల్ ప‌టేల్ నిలిచాడు. ఈ జాబితాలో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రావో ఉన్నారు. 

భువనేశ్వర్ (2016, 2017), బ్రావో (2013, 2015)  సీజ‌న్ల‌లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ అవార్డును గెలుచుకున్నారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ అంత‌కుముందు 2021 సీజన్‌లో ఆర్సీబీ త‌ర‌పున ప‌ర్పుల్ క్యాప్‌ను ద‌క్కించుకున్నాడు.

అదే విధంగా మ‌రో రికార్డును కూడా ప‌టేల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లు త‌ర‌పున ప‌ర్పుల్‌ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడిగా హర్షల్ నిలిచాడు.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు