Breaking News

హ్యారీ బ్రూక్ మెరుపు సెంచ‌రీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Wed, 09/25/2024 - 08:47

చెస్టర్-లీ-స్ట్రీట్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో వ‌న్డేలో డక్‌వర్త్-లూయిస్ ప్ర‌కారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో త‌మ సిరీస్ ఆశ‌ల‌ను ఇంగ్లండ్ స‌జీవంగా ఉంచుకుంది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కు ఇంగ్లీష్ జ‌ట్టు త‌గ్గించింది. 

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కంగారులు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌కు విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ దూర‌మైన‌ప్ప‌ట‌కి మిగితా బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స్టీవ్ స్మిత్(60), గ్రీన్‌(42), హార్దీ(44) రాణించారు.

సెంచ‌రీతో చెల‌రేగిన బ్రూక్‌..?
అనంత‌రం 305 పరుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే త‌డ‌బ‌డింది. మిచిల్ స్టార్క్ దెబ్బ‌కు 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

ఆసీస్ బౌల‌ర్ల‌పై బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. అద్భుత‌మైన సెంచ‌రీతో త‌మ జ‌ట్టును ఆదుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. 94 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌.. 13 ఫోర్లు,2 సిక్సులతో 110 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు విల్ జాక్స్‌(84 పరుగులు; 9 ఫోర్లు,1 సిక్స్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. 

వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ 37.4 ఓవర్లలో 254-4 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ ఆగిపోయింది. ఈ క్రమంలో వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే  లండన్ వేదికగా శుక్రవారం(సెప్టెంబర్ 27)న జరగనుంది.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)