Breaking News

ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు కీలక నిర్ణయం..

Published on Thu, 11/16/2023 - 16:19

ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  బిగ్ బాష్‌ లీగ్‌-2023 సీజన్‌ నుంచి  బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు బ్రూక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్‌ జట్టు ఈ ఏడాది డిసెంబర్‌లో వైట్‌బాల్‌ సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించనుంది.

ఈ కరేబియన్‌ టూర్‌లో భాగంగా ఆతిథ్య విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వెర్వేరు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్లను ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలోను హ్యారీ బ్రూక్‌ సభ్యునిగా ఉన్నాడు.

ఈ క్రమంలో రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించకున్నాడు.  బిగ్ బాష్‌ లీగ్‌-2023 డిసెంబర్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే విధంగా ఇంగ్లండ్‌ కరేబియన్‌ టూర్‌ డిసెంబర్‌ 3న మొదలు కానుంది.  వెస్టిండీస్‌ పర్యటన ముగిసినంతరం ఇం‍గ్లీష్‌ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ జరగనుంది.
చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్‌ రా బాబు.. అందుకే 'చోకర్స్‌' ట్యాగ్‌ లైన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)