ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే

Published on Sun, 12/17/2023 - 09:24

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ విధ్వంసర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఆండ్రీ రస్సెల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే పెద్దగా ఫామ్‌లో లేని బ్రూక్‌ స్ట్రైక్‌లో ఉండడంతో విండీస్‌ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను బ్రూక్‌ తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌ బాది ఇంగ్లండ్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.  బ్రూక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఫలితంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌  19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బ్రూక్‌తో పాటు ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కూడా(51) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ తప్పు చేసింది..!?
ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున హ్యారీ బ్రూక్‌ ఆడాడు. గత సీజన్‌ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ బ్రూక్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు హ్యారీని ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచిపెట్టింది. ఈ క్రమంలో విండీస్‌పై బ్రూక్‌ ఇన్నింగ్స్‌ చూసిన అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని వదిలి తప్పు చేసింది అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతడికి మరోక ఛాన్స్‌ ఇచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)