Breaking News

హర్మన్‌ప్రీత్‌ ఫిఫ్టీ.. గుజరాత్‌ జెయింట్స్‌ టార్గెట్‌ 163

Published on Tue, 03/14/2023 - 21:27

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ వుమెన్‌ పోరాడే స్కోరు సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శ‌త‌కంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హ‌ర్మ‌న్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 ర‌న్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన త‌నూజ క‌న్వార్ గుజ‌రాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔట‌య్యాక వెంట‌నే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో 136 పరుగుల వ‌ద్ద ముంబై ఐదో వికెట్ ప‌డింది.

ఆ త‌ర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవ‌ర్‌లో అష్లీ గార్డ్‌న‌ర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వ‌రుస బంతుల్లో హ‌ర్మ‌న్‌ప్రీత్, అమ‌న్‌జోత్ కౌర్‌ల‌ను ఔట్ చేసింది. కానీ, ఆఖ‌రి బంతికి జింతిమ‌ని క‌తియా రెండు ర‌న్స్ తీసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో అష్లీ గార్డ్‌న‌ర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్ రానా, త‌నూజా క‌న్వార్ త‌లా ఒక‌ వికెట్ ప‌డ‌గొట్టారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)