Breaking News

హర్మన్‌ప్రీత్‌కు 78 లక్షలు

Published on Mon, 10/14/2024 - 08:29

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) వేలంలో భారీ ధర పలికింది. ఆదివారం ప్రారంభమైన హెచ్‌ఐఎల్‌ లీగ్‌ తొలి రోజు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్‌ రూ. 78 లక్షలు పెట్టి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ను కొనుగోలు చేసుకుంది. వేలం మొదటి రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అభిషేక్ కోసం బెంగాల్‌ టైగర్స్‌ ఫ్రాంచైజీ రూ. 72 లక్షలు వెచ్చించగా.. యూపీ రుద్రాస్‌ ఫ్రాంచైజీ హార్దిక్‌ సింగ్‌ను రూ. 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేసుకుంది. 

తమిళనాడు డ్రాగన్స్‌ జట్టు అమిత్‌ రోహిదాస్‌ కోసం రూ. 48 లక్షలు వెచి్చంచగా... బెంగాల్‌ టైగర్స్‌ ఫ్రాంచైజీ జుగ్‌రాజ్‌కు అంత మొత్తమే ఇచ్చి తీసుకుంది. హైదరాబాద్‌ తూఫాన్స్‌ ఫ్రాంచైజీ తొలి రోజు వేలంలో అత్యధికంగా సుమిత్‌ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో భారత్‌ నుంచి 54 మంది ప్లేయర్లతో పాటు 18 మంది విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 16 కోట్ల 88 లక్షల 50 వేలు ఖర్చు చేశాయి. 

ఎనిమిది ఫ్రాంచైజీల్లో కళింగ లాన్సర్స్‌ వద్ద అత్యధికంగా రూ. 2.57 కోట్లు ఇంకా మిగిలి ఉండగా... అత్యల్పంగా బెంగాల్‌ టైగర్స్‌ వద్ద రూ. 1.44 కోట్లు పర్స్‌ మనీ ఉంది. హైదరాబాద్‌ తూఫాన్స్‌ ఫ్రాంచైజీ వద్ద ఇంకా రూ. 2.04 కోట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన గొంజలో పైలట్‌ అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. అతడికోసం తమిళనాడు డ్రాగన్స్‌ జట్టు రూ. 68 లక్షలు వెచ్చించింది. నెదర్లాండ్స్‌కు చెందిన జిప్‌ జాన్‌సెన్‌ను రూ. 54 లక్షలు పెట్టి తమిళనాడు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)