Breaking News

భారత కెప్టెన్‌ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!

Published on Mon, 02/20/2023 - 21:55

టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో తలపడేందుకు మైదానంలో అడుగుపెట్టిన హర్మన్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పురుషుల, మహిళల క్రికెట్‌లో మరెవరెకీ ఈ రికార్డు సాధ్యం కాలేదు.

అంతకుముందు అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ(148) రికార్డును కూడా హర్మన్‌ బ్రేక్‌ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 18(శనివారం) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ ఈ ఘనత సాధించింది.

ఇక మహిళల క్రికెట్ లో హర్మన్ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్‌ సుజీ బేట్స్‌ 143 మ్యాచ్‌లతో రెండోస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా 115 మ్యాచ్‌లతో ఉంది. అదేవ విధంగా టీ20లలో రోహిత్, విరాట్ కోహ్లిల తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ నిలిచింది. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం ఆమె 13 పరుగులు చేసింది. 

సెమీస్‌లో భారత్‌
ఇ‍క  ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత్‌..సెమీస్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.అయితే ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 54/2 వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో..  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో భారత్‌ను విజేతగా నిర్ణయించారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)