Breaking News

24 గంటల్లో సీన్‌ రివర్స్‌.. యూపీ వారియర్జ్‌ ప్లేయర్‌ అద్భుతం

Published on Fri, 01/16/2026 - 07:13

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2026లో యూపీ వారియర్జ్‌ తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో నిదానంగా ఆడుతుందని రిటైర్డ్‌ ఔట్‌గా వెనక్కు పలిపించిన హర్లీన్‌ డియోల్‌ ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో వారియర్జ్‌ను గెలిపించింది. 24 గంటల్లోనే హర్లీన్‌ నుంచి ఈ కమ్‌ బ్యాక్‌ చూసి అభిమానులు ఔరా అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమన్‌జోత్‌ కౌర్‌ (38), నికోలా క్యారీ (32 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఎడిషన్‌లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైంది. వారియర్జ్‌ బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌, ఆశా శోభన తలో వికెట్‌ తీశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆది నుంచే నిలకడగా ఆడిన వారియర్జ్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. ఒత్తిడిలో హర్లీన్‌ డియోల్‌ (39 బంతుల్లో 64 నాటౌట్‌; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి వారియర్జ్‌ను గెలిపించింది. ఆమెకు మెగ్‌ లాన్నింగ్‌ (25), లిచ్‌ఫీల్డ్‌ (25), క్లో ట్రాయాన్‌ (27 నాటౌట్‌) సహకరించారు. ముంబై బౌలర్లలో నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ 2, అమేలియా కెర్‌ ఓ వికెట్‌ తీశారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)