Breaking News

వారెవ్వా.. ఫిలిప్స్‌ను మించిపోయాడుగా! వీడియో వైర‌ల్‌

Published on Fri, 03/21/2025 - 12:45

ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టీ20లో పాకిస్తాన్ ఆట‌గాడు హారిస్ రవూఫ్ అసాధ‌ర‌ణ ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ర‌వూఫ్ అద్భుత‌మైన క్యాచ్‌తో కివీస్ స్టార్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ పెవిలియ‌న్‌కు పంపాడు. అత‌డి క్యాచ్‌తో ఆక్లాండ్ మైదానం మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణయించుకుంది.

ఈ క్ర‌మంలో పాక్ బౌలింగ్ ఎటాక్‌ను షాహీన్ అఫ్రిది ప్రారంభించ‌గా.. కివీస్ ఓపెన‌ర్ల‌గా టిమ్ సీఫ‌ర్ట్‌, అలెన్ బ‌రిలోకి దిగారు. అయితే మొద‌టి ఓవ‌ర్ వేసిన షాహీన్ అఫ్రిది ఐదో బంతిని లెగ్ సైడ్‌గా సంధించాడు. ఆ బంతిని అలెన్ లెగ్ సైడ్‌లోకి ఫ్లిక్ చేశాడు. ఈ క్ర‌మంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రవూఫ్ అద్బుతం చేశాడు.

రౌఫ్ తన కుడి వైపున‌కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఫిన్ అలెన్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ర‌వూఫ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.  గ్లెన్‌ ఫిలిప్స్‌ను మించిన క్యాచ్ ప‌ట్టావు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ డూర్ ఆర్ డై. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. సిరీస్‌లో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల్సిందే.

ఇక ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, బాబ‌ర్ ఆజం దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో విఫ‌ల‌మైనందుకు ఈ సీనియ‌ర్ ద్వ‌యంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాను నియ‌మించిన పీసీబీ.. వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్టార్ ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్‌కు అప్ప‌గించింది.
చదవండి: IPL 2025: ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌.. కట్‌ చేస్తే! పంత్‌ టీమ్‌లోకి ఎంట్రీ?
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)