Breaking News

బుమ్రాకు నిరాశ.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న పాక్‌ బౌలర్‌

Published on Wed, 12/11/2024 - 17:05

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు నిరాశ ఎదురైంది. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (నవంబర్‌) అవార్డును పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం హరీస్‌ రౌఫ్‌తో పాటు బుమ్రా, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జన్సెన్‌ పోటీపడ్డారు. అంతిమంగా అవార్డు హరీస్‌ రౌఫ్‌నే వరించింది. 

రౌఫ్‌ నవంబర్‌ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రౌఫ్‌ ప్రదర్శనల కారణంగా రెండు దశాబ్దాల తర్వాత పాక్‌ ఆస్ట్రేలియాను వారి సొండగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రౌఫ్‌ ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో పాక్‌ ఆసీస్‌పై 2-1 తేడాతో గెలుపొందింది. 

అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రౌఫ్‌ సత్తా చాటాడు. పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో రౌఫ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ సిరీస్‌ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ రౌఫ్‌ రాణించాడు. ఈ సిరీస్‌లో రౌఫ్‌ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా రౌఫ్‌ నవంబర్‌ నెలలో 18 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు.

వుమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్న డానీ వ్యాట్‌
నవంబర్‌ నెలకు గానూ మహిళల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఇంగ్లండ్‌కు చెందిన డానీ వ్యాట్‌ గెలుచుకుంది. నవంబర్‌ నెలలో సౌతాఫ్రికాపై అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వ్యాట్‌ ఈ అవార్డు గెలుచుకుంది. ఈ సిరీస్‌లోని మూడు టీ20ల్లో వ్యాట్‌ 163.21 స్ట్రయిక్‌ రేట్‌తో 142 పరుగులు చేసింది. 

ఇదే సిరీస్‌లో వ్యాట్‌ టీ20ల్లో 3000 పరుగుల అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ అవార్డు కోసం వ్యాట్‌ షర్మిన్‌ అక్తెర్‌, నదినే డి క్లెర్క్‌లతో పోటీపడింది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు