Breaking News

భారత చెస్‌ 87వ గ్రాండ్‌మాస్టర్‌గా హరికృష్ణన్‌

Published on Mon, 07/14/2025 - 04:28

చెన్నై: భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్‌ ఈ ఘనత సాధించాడు. ఫ్రాన్స్‌లో ముగిసిన లా ప్లాగ్ని అంతర్జాతీయ చెస్‌ ఫెస్టివల్‌లో హరికృష్ణన్‌ జీఎం హోదా పొందడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను ఖరారు చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఇనియన్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణన్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో చివరి జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. 

2023లో బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో తొలి జీఎం నార్మ్‌ పొందిన ఈ మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకామ్‌) విద్యార్థి ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్‌లో జరిగిన అందుజార్‌ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్‌ పొందాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఏడేళ్ల క్రితం గ్రాండ్‌మాస్టర్‌ హోదా కోసం ప్రయత్నం మొదలైంది. గత మూడేళ్లలో క్రమం తప్పకుండా టోర్నీల్లో పోటీపడుతున్నాను. కానీ జీఎం నార్మ్‌లు సాధించలేకపోయాను. 

అయితే రెండు నెలల వ్యవధిలో రెండు జీఎం నార్మ్‌లు పొంది గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ శ్యాం సుందర్‌ మోహన్‌రాజ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న హరికృష్ణన్‌ వ్యాఖ్యానించాడు.   

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)