టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేస్తున్నాడు!?

Published on Sun, 12/24/2023 - 18:36

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న హార్దిక్‌ వేగంగా కోలుకుంటున్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు, ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

వచ్చే ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ సమయానికి పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని సమాచారం. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌ సిరీస్‌లో భారత జట్టును హార్దికే సారధిగా నడిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.  స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.  కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్‌ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు.

దీంతో అతడి చీలమండకు గాయమైంది. అప్పటి నుంచి ఆటకు హార్దిక్‌ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు హార్దిక్‌ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ ట్రేడ్‌ చేసుకుంది. అంతేకాకుండా రోహిత్‌ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను కూడా అప్పగించింది.
చదవండి: IPL 2024: లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక నిర్ణయం..!? సురేష్‌ రైనాకు..

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)