Breaking News

'ఒక్క ఓవర్‌ జీవితాన్ని తలకిందులు చేసింది.. త్వరగా కోలుకో'

Published on Wed, 04/26/2023 - 17:46

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ గుర్తుందిగా. ఒక్క ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది రింకూ సింగ్‌ కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. కానీ ఆ ఓవర్‌ వేసిన గుజరాత్‌ బౌలర్‌ యష్‌ దయాల్‌కు మాత్రం అది ఒక పీడకలగా మిగిలిపోయింది. ఒక ఓవర్‌ ఒకరిని హీరో చేస్తే.. మరొకరిని జీరో చేసింది.

ఒక్కో ఓవర్‌తో యష్‌ జీవితం తలకిందులు
రింకూ సింగ్‌ దెబ్బకు యష్‌ దయాల్‌ ఈ సీజన్‌లో మరొక మ్యాచ్‌ ఆడలేకపోయాడు. అందుకు వేరే కారణం కూడా ఉంది. ఆ ఒక్క ఓవర్‌ యష్‌ దయాల్‌ జీవితాన్ని తలకిందులు చేసింది. తనవల్లే గుజరాత్‌ ఓడిందని మానసికంగా బాగా దెబ్బతిన్న యష్‌దయాల్‌ అనారోగ్యం బారిన పడ్డాడు.

దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలలో బరువు తగ్గిన యష్‌ దయాల్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం మాట్లాడిన పాండ్యా యష్‌ దయాల్‌ పరిస్థితిని వివరించాడు.


Photo: IPL Twitter

మళ్లీ ఆడతాడో లేదో!
"ఈ సీజన్ లో అతడు మళ్లీ ఆడతాడో లేదో చెప్పలేను. ఆ మ్యాచ్ తర్వాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. 7-8 కిలోల బరువు తగ్గాడు. ఆ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇక అదే సమయంలో అతడు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అతడు బరిలోకి దిగే పరిస్థితి కూడా లేదు. అతన్ని మళ్లీ ఫీల్డ్ లో చూడటానికి చాలా సమయమే పడుతుంది" అని హార్దిక్ పేర్కొన్నాడు.

ఇక ఒక్క మ్యాచ్ కాదు ఒక్క ఓవర్‌తో యశ్ దయాల్ కెరీర్ తలకిందులైంది. జట్టు అతనికి అండగా నిలిచిందని సహచర ప్లేయర్స్ చెబుతున్నా.. దాని తాలూకు షాక్ నుంచి యశ్ ఇప్పటికీ కోలుకోలేకపోయాడని అర్థమవుతోంది. అటు యశ్ దయాల్‌ కుటుంబం కూడా చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా యష్‌ దయాల్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందాం.

చదవండి: Yash Dayal: అత్యంత చెత్త రికార్డు.. పాపం మొహం చూపించలేక 

అదో కాలరాత్రి, అతని తల్లి అన్నం ముట్టట్లేదు.. యశ్‌ దయాల్‌ తండ్రి ఆవేదన

'అర్జున్‌ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)