Breaking News

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్యా.. ఫొటోలు వైరల్‌

Published on Thu, 06/22/2023 - 10:34

Hardik Pandya and Natasa Stankovic Holiday: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు. ఈ క్రమంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యతో కలిసి థాయ్‌లాండ్‌లో వాలిపోయాడు.

ఫుకెట్‌లో కుటుంబంతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నాడు. భార్యా, కొడుకుతో స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతూ సేదతీరుతున్నాడు. నచ్చిన ఫుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తూ
ఈ ముగ్గురూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలను హార్దిక్‌ భార్య నటాషా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో అగస్త్య ఏనుగులకు అరటిపండ్లు తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

రన్నరప్‌తో సరి
కాగా ఐపీఎల్‌-2023లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ చేరుకుంది. అయితే, అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ధోని సేన ఐదోసారి చాంపియన్‌గా అవతరించగా... వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న టైటాన్స్‌కు నిరాశే మిగిలింది.

విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ సారథిగా!
ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ముగిసిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లో తలపడింది. దీంతో ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తదితరులు ఇంగ్లండ్‌కు వెళ్లగా.. హార్దిక్‌ పాండ్యాకు కావాల్సినంత విశ్రాంతి లభించింది.

కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రోహిత్‌ సేన.. జూలై 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం హార్దిక్‌ పాండ్యా మరోసారి మైదానంలో దిగనున్నాడు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పాండ్యా సారథ్యం వహించే అవకాశం ఉంది.

చదవండి: స్కాట్లాండ్‌ ప్లేయర్‌ విధ్వంసం; ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)