Breaking News

హార్దిక్ పాండ్యాకు షాక్‌!.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా సూర్య‌కుమార్‌?

Published on Sun, 08/04/2024 - 10:58

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీల‌క మార్పులు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ జ‌ట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. 

ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మ‌రి త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను ముంబై మెనెజ్‌మెంట్ హార్దిక్‌కు అప్ప‌గించింది. రోహిత్ శ‌ర్మ స్ధానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ప‌ట్టిన హార్దిక్‌.. త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు.

అత‌డి సార‌థ్యంలో దారుణ ప్ర‌ద‌ర్శ‌ర‌న క‌న‌బ‌రిచిన ముంబై క‌నీసం లీగ్ స్టేజిని కూడా దాట‌లేక‌పోయింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది. ఆటగాడిగా కూడా పాండ్యా విఫలమయ్యాడు. 

ఈ క్రమంలోనే అతడిని రిటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి. అతడి స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొం‍టున్నాయి. 

సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే  భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్ శర్మ వారసుడిగా సూర్యను బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంక టీ20 సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే సూర్య ఆకట్టుకున్నాడు. లంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)