Breaking News

హార్దిక్‌ పాండ్యాకు గాయం 

Published on Fri, 10/20/2023 - 03:32

ప్రపంచకప్‌ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్‌ మూడో బంతిని బ్యాటర్‌ దాస్‌ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్‌ చేయడని బీసీసీఐ ప్రకటించింది.

అతని కాలికి స్కాన్‌ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్‌ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్‌ చేశాడు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)