Breaking News

MI Vs GT: అదే మా కొంప‌ముంచింది.. తిల‌క్ ఆలోచ‌న స‌రైన‌దే: హార్దిక్ పాండ్యా

Published on Mon, 03/25/2024 - 06:40

ఐపీఎల్ -2024 సీజ‌న్‌ను ముంబై ఇండియ‌న్స్‌తో ఓట‌మితో ఆరంభించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. సునాయ‌సంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ముంబై ప‌రాజ‌యం చ‌విచూసింది. ఆఖ‌రి 6 ఓవ‌ర్ల‌లో ముంబై విజ‌యానికి 48 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. వ‌రుస‌క్ర‌మంలో వికెట్లు కోల్పోయి ఓట‌మి  కొనితెచ్చుకుంది.

169 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై  నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో బ్రెవిస్‌(46), రోహిత్ శ‌ర్మ‌(43) టాప్ స్కోరర్ల‌గా నిలిచారు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు.  ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో వ‌రుస‌గా వికెట్ల కోల్పోవ‌డంతో ఓట‌మి పాలైమ‌ని హార్దిక్ తెలిపాడు.

"ఆఖరి వ‌ర‌కు మేము గేమ్‌లోనే ఉన్నాం. చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో మా విజ‌యానికి 42 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. మా చేతిలో 6 వికెట్ల ఉండ‌డంతో ఈజీగా గెలుస్తామ‌ని భావించాము. కానీ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయాం. అదే మా కొంప‌ముంచింది. చివరి ఐదు ఓవ‌ర్ల‌లో ముంబై  ఇంత త‌క్కువ స్కోర్ ఛేదించక‌పోయిన మ్యాచ్‌ల్లో క‌చ్చితంగా ఇదొక‌టి.

అహ్మ‌దాబాద్‌లో మ‌ళ్లి తిరిగి వ‌చ్చి ఆడినందుకు సంతోషంగా ఉంది.  అహ్మ‌దాబాద్ స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు మొత్తం అభిమానుల‌తో నిండిపోయింది. గుజ‌రాత్ కూడా అద్భుతంగా ఆడింది. ఇక‌ ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో  తిల‌క్ వ‌ర్మ సింగిల్‌ను తిర‌ష్క‌రించ‌డం స‌రైన నిర్ణ‌య‌మే.

ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ‌ర్ స్ట్రైక్‌లో ఉంటే బెట‌ర్ అని తిలక్ భావించాడు. నేను కూడా అత‌డికి ఫుల్ స‌పోర్ట్‌గా నిలిచాను. ఇంకా మాకు 13 మ్యాచ్‌లు ఉన్నాయి. త‌ర్వాతి మ్యాచ్‌లో క‌చ్చితంగా మేము తిరిగి క‌మ్‌బ్యాక్ ఇస్తామ‌ని" హార్దిక్ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో పేర్కొన్నాడు. కాగా హార్దిక్ ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓట‌మిని ఎదుర్కోవ‌డం గ‌మ‌నార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)