Breaking News

చ‌రిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్‌గా

Published on Fri, 04/04/2025 - 22:32

ఐపీఎల్‌-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. 

మిగితా బౌల‌ర్లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికి హార్దిక్ మాత్రం ఐదు వికెట్ల‌తో చెల‌రేగాడు. పాండ్యా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 36 ప‌రుగులిచ్చి 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్‌లో ఇది తొలి ఫైవ్ హాల్ వికెట్ కావ‌డం గ‌మానార్హం. ఐపీఎల్‌లో కాదు టీ20ల్లోనే అత‌డికి మొద‌టి ఐదు వికెట్ల హాల్. త‌ద్వారా ప‌లు అరుదైన రికార్డుల‌ను పాండ్యా త‌న పేరిట లిఖించుకున్నాడు.

తొలి కెప్టెన్‌గా..
ఐపీఎల్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఎవ‌రికి సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన కెప్టెన్‌గా హార్దిక్ రికార్డులెక్కాడు.  ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే  ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా 16  ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.

అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్ల సాధించిన రెండో కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే రికార్డును పాండ్యా స‌మం చేశాడు. కుంబ్లే త‌న ఐపీఎల్‌ కెరీర్‌లో కెప్టెన్‌గా 30 వికెట్లు ప‌డ‌గొట్టగా.. పాండ్యా ఇప్ప‌టివ‌ర‌కు సార‌థిగా 30 వికెట్లు సాధించాడు.

ఐపీఎల్‌లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌లు వీరే..
5/36- హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియ‌న్స్‌)
4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/17- JP డుమిని (ఢిల్లీ డేర్‌డేవిల్స్‌)
4/21- షేన్ వార్న్ (రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌)

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే:
57 - షేన్ వార్న్
30 - హార్దిక్ పాండ్యా
30 - అనిల్ కుంబ్లే
25 - రవిచంద్రన్ అశ్విన్
21 - పాట్ కమ్మిన్స్

మార్ష్‌ విధ్వంసం.. 
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ల‌క్నో సూపర్‌ జెయింట్స్‌ 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 60), మార్‌క్ర‌మ్‌(53) హాఫ్ సెంచ‌రీల‌తో మెర‌వ‌గా.. డేవిడ్ మిల్ల‌ర్‌(27), బ‌దోని(27) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్ధిక్ పాండ్యాతో పాటు.. విఘ్నేష్‌ పుత్తార్‌, బౌల్ట్‌, అశ్వినీ కుమార్ త‌లా వికెట్ సాధించారు.
చ‌ద‌వండి: IPL 2025: సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?



 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)