Breaking News

IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్‌

Published on Fri, 01/06/2023 - 10:42

పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్‌ ఏదైనా బౌలర్లు నో బాల్స్‌ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్‌ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్‌ సింగ్‌ వేసిన నో బాల్స్‌ (2 ఓవర్లలో 5 నో బాల్స్‌) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు.

యువకుడైన అర్షదీప్‌ తన బేసిక్‌ ఎరర్స్‌ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పవర్‌ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్‌, స్కై, శివమ్‌ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు.

కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్‌ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)