Breaking News

హార్దిక్‌ పాండ్యా సోదరుడి అరెస్ట్‌!

Published on Thu, 04/11/2024 - 10:54

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సోదరుడు వైభవ్‌ పాండ్యా అరెస్టైనట్లు సమాచారం. పాండ్యా సోదరులను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫోర్జరీ ద్వారా దాదాపు రూ. 4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభ​వ్‌ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. స్టార్‌ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్‌ పాండ్యా సవతి సోదరుడు. వీరితో కలిసి అతడు 2021లో పాలిమర్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. 

ఇందుకోసం హార్దిక్‌, కృనాల్‌ మూలధనం కింద ఒక్కొక్కరు 40 శాతం.... వైభవ్‌ తన వంతు వాటాగా 20 శాతం ఇచ్చాడు. అయితే, సోదరులకు తెలియకుండా మరో సంస్థను మొదలుపెట్టిన వైభవ్‌.. పాత వ్యాపారంలోని నిధులను మళ్లించాడు.

హార్దిక్‌, కృనాల్‌లకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా రూ. 4.3 కోట్లు తన సొంత వ్యాపారానికి వాడుకున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

కాగా హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నారు. హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా భారీ మొత్తం వెనుకేయగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడుతున్న కృనాల్‌ ఈసారి రూ. 8.25 కోట్లు అందుకున్నాడు.

ఇక ఈ సీజన్‌లో హార్దిక్‌ సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచింది. మరోవైపు.. కృనాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో నాలుగింట మూడు విజయాలతో టాప్‌-3లో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. గుజరాత్‌కు చెందిన హార్దిక్‌ పాండ్యాకు కృనాల్‌ తోబుట్టువు కాగా.. వైభవ్‌ పాండ్యా, గౌరవ్‌ పాండ్యా అనే మరో ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)