Breaking News

చరిత్ర సృష్టించిన హార్దిక్‌ పాండ్యా.. తొలి ప్లేయర్‌గా రికార్డు

Published on Mon, 06/10/2024 - 17:45

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి రుజువు చేసింది. టీ20 ప్రపంచకప్‌-2024లో ఆదివారం న్యూయర్క్ వేదికగా పాక్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

ఈ విజయంతో టీమిండియా సూపర్‌-8కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో తమ సూపర్‌-8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక భారత విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైన పాండ్యా.. బౌలింగ్‌లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. హార్దిక్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 24 ప‌రుగులిచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో పాండ్యా ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త బౌల‌ర్‌గా హార్దిక్ రికార్డుల‌కెక్కాడు.

పాక్‌పై ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు. 

అదే విధంగా ఓవ‌రాల్‌గా పాక్‌-భార‌త్ మ‌ధ్య జ‌రిగిన టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు పడగొట్టిన బౌల‌ర్ కూడా పాండ్యానే కావ‌డం గ‌మ‌నార్హం. పాండ్యా త‌ర్వాత ఉమ‌ర్ గుల్‌(11), భువ‌నేశ్వ‌ర్ కుమార్‌(11)  ఉన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)