Breaking News

'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్‌.. అంద‌రి కంటే డిఫరెంట్'

Published on Sat, 05/11/2024 - 19:06

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ పాండ్యా..తన మార్క్‌ చూపించడంలో విఫలమయ్యాడు. 

కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్‌ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్‌ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన కెప్టెన్‌ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు.

"హార్దిక్‌ పాండ్యా నిజంగా సూపర్‌ కెప్టెన్‌. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్‌ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్‌ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్‌ దిట్ట.

నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)