Breaking News

చాహల్‌ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో.. అందుకే ఎంపిక చేయడం లేదు

Published on Wed, 09/20/2023 - 08:37

వన్డే ప్రపంచకప్‌-2023 సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో అనుహ్యంగా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు సెలక్టర్లు చోటుకల్పించారు. ఈ సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. మరో స్పిన్నర్‌  యుజ్వేంద్ర చాహల్‌కు మాత్రం మరోసారి మొండి చేయి చూపించారు.

అశ్విన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. ఇక ఆసీస్‌ సిరీస్‌కు చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్‌ ఎవరితోనైనా గొడవపడి ఉండవచ్చు, అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని భజ్జీ సంచలన వాఖ్యలు చేశాడు.

చాహల్‌ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో..
"యుజ్వేంద్ర చాహల్ ఆసీస్‌ సిరీస్‌ జట్టులో ఉండాల్సింది. అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు ఎవరితోనైనా గొడవపడ్డాడా? లేదా ఎవరికైనా ఏమన్నా అన్నాడా? అనేది మాత్రం తెలియడం లేదు. కేవలం స్కిల్స్‌ పరంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే చాహల్‌కు కూడా చోటు ఇవ్వాలి.

చాలా మంది భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నందున చాహల్‌ పేరు జట్టులో ఉంటుందని భావించాను. జట్టు మేనెజ్‌మెంట్‌ హాఫ్‌ స్పిన్నర్ల కోసం వెతుకుతున్నట్లు నాకు అన్పిస్తోంది. అందుకే వరల్డ్‌కప్‌ ప్రణాళికలలో లేని అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు మళ్లీ పిలుపునిచ్చారని" భజ్జీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.

తొలి రెండు వన్డేల కోసం భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

మూడో వన్డే కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన బాబర్‌ ఆజం! ఫోటోలు వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)