Breaking News

అశ్విన్‌ అద్భుత స్పిన్నరే కానీ...

Published on Sun, 12/01/2024 - 02:59

ముంబై: సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్‌ సుందర్‌ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌... భారత్‌ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్‌ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సుందర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. 

ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్‌ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్‌లపై అనుభవజు్ఞడైన అశ్విన్‌ కంటే సుందర్‌కు అవకాశం ఇచ్చారు. పెర్త్‌లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్‌ అజేయమైన జట్టుగా కనిపించేది. 

అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్‌ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడం భారత్‌కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్‌ కెపె్టన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేకున్నా... జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్‌ కొనియాడాడు.  

కోహ్లిని చూసి లబుషేన్‌ నేర్చుకోవాలి: పాంటింగ్‌ 
ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్‌ లబుషేన్, స్టీవ్‌ స్మిత్‌కు... మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్‌ విరాట్‌ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్‌ టెస్టులో లబుõÙన్‌ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్‌పై నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. 

పెర్త్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్‌ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్‌ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్‌ అన్నాడు.

మరోవైపు ఆసీస్‌ మాజీ పేసర్‌ జాన్సన్‌ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్‌ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్‌ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్‌ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)