Breaking News

ధోని కోపంతో బ్యాట్‌ విరగ్గొట్టాడు: హర్భజన్ సింగ్

Published on Mon, 04/24/2023 - 17:50

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మాజీ సారధి ఎంఎస్‌ ధోని.. "కెప్టెన్‌ కూల్‌"గా పేరు గాంచిన సంగతి తెలిసిందే.  చాలా మ్యాచ్‌ల్లో ధోని తన ప్రశాంతతతోనే భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. ధోని తన చర్యలతో ఎంతోమంది యువ కెప్టెన్‌లకు ఆదర్శంగా నిలిచాడు. అటువంటి ధోని ఓ సందర్భంలో తన ప్రశంతతనను కోల్పోయి బ్యాట్‌  విరగ్గొట్టాడంట.

ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి భారత జట్టుకు ఆడిన విషయం విధితమే. జార్ఖండ్‌లో ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోని తన బ్యాట్‌ను విరగ్గొట్టినట్లు భజ్జీ తెలిపాడు.

"జార్ఖండ్‌లో మేము రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్వ్కాడ్‌ మ్యాచ్‌ ఆడుతున్నాం. ఈ మ్యాచ్‌లో ధోని జట్టు చాలా వెనుకబడింది. ధోని ఆఖరిలో బ్యాటింగ్‌ వచ్చాడు. ఈ క్రమంలో తన జట్టు  వెనుకబడడంతో ధోని కోపంతో ఊగిపోయాడు. తన బ్యాట్‌ని నెలకేసి కొట్టాడు.

దీంతో బ్యాట్‌ హ్యాండిల్ విరిగిపోయింది" అని సీఎస్‌కే, కేకేఆర్‌ మ్యాచ్‌ సందర్భంగా హర్భజన్‌ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చదవండి: IPL 2023: ఢిల్లీతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)