Breaking News

భారత దిగ్గజానికి అనూహ్య ఓటమి

Published on Wed, 11/12/2025 - 10:41

దోహా: ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం పంకజ్‌ అద్వానీకి అనూహ్య పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన నాకౌట్‌ దశ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనా ప్లేయర్‌ డెంగ్‌ హావోహుయ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంకజ్‌ అద్వానీ 1–4 (24–66, 38–71, 11–62, 79–46, 42–70) ఫ్రేమ్‌ల తేడాతో ఓటమి చవిచూశాడు.

అంతకుముందు గ్రూప్‌ ‘హెచ్‌’ లో పంకజ్‌ రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత పొందాడు. మొత్తం 12 గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 24 మంది ప్లేయర్లు నాకౌట్‌ దశకు చేరుకున్నారు. 

భారత్‌ కే చెందిన హుస్సేన్‌ ఖాన్‌ మాత్రం నాకౌట్‌ దశ తొలి మ్యాచ్‌లో గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత పొందాడు. నాకౌట్‌ మ్యాచ్‌లో హుస్సేన్‌ 4–3 (73–49, 59–30, 68–73, 36–48, 60–14, 44–59, 85–37) ఫ్రేమ్‌ల తేడాతో హసన్‌ కెర్డె (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు.

అనాహత్‌ శుభారంభం 
న్యూఢిల్లీ: చైనా ఓపెన్‌ అంతర్జాతీయ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత జాతీయ చాంపియన్‌ అనాహత్‌ సింగ్‌ శుభారంభం చేసింది. షాంఘైలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అనాహత్‌ 11–6, 11–8, 11–3తో మెనా హమీద్‌ (ఈజిప్ట్‌)పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు అభయ్‌ సింగ్, వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. అభయ్‌ 8–11, 7–11, 4–11తో బాప్టిస్ట్‌ మసోట్టి (ఫ్రాన్స్‌) చేతిలో, సెంథిల్‌ కుమార్‌ 8–11, 12–14, 6–11తో మొహమ్మద్‌ అబూఎల్గర్‌ (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)