35 ఏళ్ల వయసులో రహానే చేసినప్పుడు, నేను చేయలేనా..?

Published on Thu, 07/06/2023 - 13:10

టీమిండియా టెస్ట్‌ క్రికెటర్‌, ఆంధ్ర స్టార్‌ ఆటగాడు హనుమ విహారి ఇటీవల స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై విహారి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో అజింక్య రహానే టెస్ట్‌ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు, తాను చేయలేనా అని అన్నాడు. రహానే లాంటి వెటరన్‌ ఆటగాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభపరిమాణమని, టాలెంట్‌ ఉన్న ఆటగాడికి వయసుతో సంబంధం లేదని రహానే నిరూపించాడని, టీమిండియాలో తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది స్పూర్తినిస్తుందని పేర్కొన్నాడు. తన వయసు 29 మాత్రమేనని, టీమిండియాకు ఆడేందుకు తనకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన హనుమ విహారి భారత్‌ తరఫున 16 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్‌ స్క్వాడ్‌ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు.

2021 ఇంగ్లండ్‌ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. విహారి పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గానూ పర్వాలేదనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 2021 సిడ్నీ టెస్ట్‌ మ్యాచ్‌ విహారికి మంచి గుర్తింపు తెచ్చింది. 

ఇక రహానే విషయానికొస్తే.. ఐపీఎల్‌ 2023లో ఇరగదీసిన ఈ ముంబైకర్‌.. ఆ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా టెస్ట్‌ల్లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఇదే స్పూర్తితో విహారి సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)