Breaking News

ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ

Published on Sat, 04/15/2023 - 07:36

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో విజయం నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది. వరుసగా విఫలమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌.. ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

55 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అదే విధంగా కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 26 బంతుల్లో 50 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిం‍ది. అనంతరం 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్‌ కెప్టెన్‌(71), రింకూ సింగ్‌ పోరాడనప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

తీరు మారని మయాంక్‌..
ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పేలవ ఫామ్‌ మాత్రం అందరని కలవరపెడుతుంది. బ్యాటింగ్‌కు అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై 13 బంతులు ఎదుర్కొన్న మయాంక్‌ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రస్సెల్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి అతడు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్‌ కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక గతేడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు సారథ్యం వహించిన మయాంక్‌ను.. 2023 సీజన్‌కు ముందు ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ 8.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. అయితే తన తీసుకున్న మొత్తానికి న్యాయం చేయడంలో మయాంక్‌ విఫలమవుతున్నాడు. ఇక వరుసగా విఫలమవుతున్న అగర్వాల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటకే పంజాబ్‌ విడిచిపెట్టింది.. ఇక్కడ కూడా అదే ఆట తీరు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: Harry Brook: 'గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)