Breaking News

ఆ జట్టు నుంచి పిలుపు.. ఇంగ్లండ్‌కు వెళ్ల‌నున్న తిల‌క్ వ‌ర్మ‌

Published on Wed, 06/11/2025 - 19:44

టీమిండియా సూప‌ర్ స్టార్‌, హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడ‌నున్నాడు. డివిజన్‌–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో హాంప్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌కు తిల‌క్ ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బుధవారం తెలిపింది. "యూకే కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ లీగ్‌లో ఆడేందుకు  హాంప్‌షైర్ కౌంటీ జట్టుతో హైద‌రాబాద్ ఆట‌గాడు ఎన్ ఠాకూర్ తిలక్ వర్మ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నందుకు సంతోషంగా ఉందని" హెచ్‌సీఎ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. క్రిక్‌బ‌జ్ రిపోర్ట్ ప్ర‌కారం.. 22 ఏళ్ల తిల‌క్ వ‌ర్మ  జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు హాంప్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు.

ఆ స‌మ‌యంలో ఎడమచేతి వాటం బ్యాట‌ర్ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు స‌ద‌రు క్ల‌బ్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. అయితే తిల‌క్ వైట్‌బాల్ గేమ్స్‌లో ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీ జ‌రుగుతోంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు 18 ఫ‌స్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడిన తిల‌క్ వ‌ర్మ‌.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు  సెంచరీలు, నాలుగు ఆర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. ఈ హైద‌రాబాదీ భార‌త జ‌ట్టుకు వైట్-బాల్ స్పెషలిస్టుగా ఉన్నాడు. 

నాలుగు వన్డేలు, 25 టీ20ల్లో భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా  అత‌డికి టీ20ల్లో అద్బుత‌మైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్‌లలో 49.93 స‌గ‌టుతో 749 పరుగులు చేశాడు. మ‌రోవైపు రుతురాజ్ గైక్వాడ్ సైతం యార్క్‌షైర్ క్ల‌బ్ త‌ర‌పున కౌంటీ క్రికెట్ ఆడ‌నున్నాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)