Breaking News

హంపి, గుకేశ్‌లకు మూడో స్థానం

Published on Sun, 06/08/2025 - 02:10

స్టావెంజర్‌: కీలకదశలో తప్పిదాలు చేయడంతో... నార్వే ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారులు కోనేరు హంపి, దొమ్మరాజు గుకేశ్‌ టైటిల్‌కు దూరమయ్యారు. మహిళల విభాగంలో హంపి... పురుషుల విభాగంలో క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నీలో హంపి 15 పాయింట్లు... గుకేశ్‌ 14.5 పాయింట్లు స్కోరు చేశారు. పురుషుల విభాగంలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (16 పాయింట్లు)... మహిళల విభాగంలో అనా ముజీచుక్‌ (16.5 పాయింట్లు) చాంపియన్స్‌గా అవతరించారు.  

పురుషుల విభాగంలో ఆరుగురు... మహిళల విభాగంలో ఆరుగురు చొప్పున పోటీపడగా... డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో గేమ్‌లను నిర్వహించారు. క్లాసికల్‌ గేమ్‌లోనే విజయం సాధిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ క్లాసికల్‌ గేమ్‌ ‘డ్రా’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహిస్తారు. క్లాసికల్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్‌ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. క్లాసికల్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్‌ గేమ్‌లో ఓడిపోతే 1 పాయింట్‌ దక్కుతుంది. క్లాసికల్‌ గేమ్‌లో ఓడిపోతే ఎలాంటి పాయింట్లు లభించవు.  

పురుషుల విభాగం చివరి రౌండ్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత నంబర్‌వన్‌ ఇరిగేశి అర్జున్, మాగ్నస్‌ కార్ల్‌సన్‌ గేమ్‌ 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్‌ గేమ్‌లో అర్జున్‌ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌లో గుకేశ్‌ 50 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఒకవేళ కరువానాపై గుకేశ్‌ గెలిచి ఉంటే అతనికి టైటిల్‌ ఖరారయ్యేది. 

గుకేశ్‌పై నేరుగా క్లాసికల్‌ గేమ్‌లోనే నెగ్గడంతో కరువానా 15.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 14 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) నాలుగో స్థానంలో... 13 పాయింట్లతో అర్జున్‌ ఐదో స్థానంలో... 9.5 పాయింట్లతో వె యి (చైనా) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు.  

మహిళల విభాగంలో చివరి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో పోటీపడిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి హంపి 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్‌ గేమ్‌ నిర్వహించగా... హంపి 40 ఎత్తుల్లో జు వెన్‌జున్‌ను ఓడించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలితో జరిగిన చివరి గేమ్‌ను అనా ముజీచుక్‌ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 

అర్మగెడాన్‌ గేమ్‌లో వైశాలి చేతిలో అనా ముజీచుక్‌ ఓడిపోయినా టైటిల్‌ను ఖరారు చేసుకుంది. 16 పాయింట్లతో లె టింగ్‌జీ (చైనా) రెండో స్థానాన్ని పొందగా... 13.5 పాయింట్లతో జు వెన్‌జున్‌కు నాలుగో స్థానం లభించింది. 11 పాయింట్లతో వైశాలి ఐదో స్థానంలో, 9 పాయింట్లతో సారా ఖాదెమ్‌ (స్పెయిన్‌) చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు.  

ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? 
నార్వే చెస్‌ టోర్నీలో ఈసారి పురుషుల, మహిళల విభాగం ప్లేయర్లకు సమాన ప్రైజ్‌మనీ కేటాయించారు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్, అనా ముజీచుక్‌లకు 7 లక్షల నార్వేజియన్‌ క్రోన్‌ల (రూ. 59 లక్షల 36 వేలు) చొప్పున లభించాయి. రన్నరప్‌గా నిలిచిన కరువానా, లె టింగ్‌జీలకు 3 లక్షల 50 వేల క్రోన్‌ల (రూ. 29 లక్షల 68 వేలు) చొప్పున దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన గుకేశ్, హంపి 2 లక్షల క్రోన్‌ల (రూ. 16 లక్షల 96 వేలు) చొప్పున అందుకున్నారు. 

నాలుగో స్థానం పొందిన నకముర, జు వెన్‌జున్‌లకు 1 లక్ష 70 వేల క్రోన్‌ల (రూ. 14 లక్షల 41 వేలు) చొప్పున లభించాయి. ఐదో స్థానంలో నిలిచిన అర్జున్, వైశాలిలకు 1 లక్ష 50 వేల క్రోన్‌ల (రూ. 12 లక్షల 72 వేలు) చొప్పున... ఆరో స్థానంలో నిలిచిన వె యి, సారాలకు 1 లక్ష 20 వేల క్రోన్‌ల (రూ. 10 లక్షల 17 వేలు) చొప్పున దక్కాయి. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)