Breaking News

హామిల్టన్‌ రికార్డు

Published on Mon, 07/08/2024 - 04:18

సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): ప్రపంచ మాజీ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ 945 రోజుల తర్వాత ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్‌ 2021 డిసెంబర్‌ 5న సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో గెలుపొందాడు. 

సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌పై ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్‌ (మెర్సిడెస్‌) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్‌ చరిత్రలో ఒకే సర్క్యూట్‌పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్‌ రికార్డు నెలకొల్పాడు. 

మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) ఫ్రాన్స్‌లోని మాగ్నీ కోర్స్‌ సర్క్యూట్‌ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్‌ రికార్డును హామిల్టన్‌ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్‌లో 12 రేసులు ముగిశాక వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) 255 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది.   
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)