Breaking News

‘ఫెరారీ’ కారులో జోరుగా...

Published on Thu, 01/23/2025 - 03:58

ఫియోరానో మోడినీస్‌ (ఇటలీ): ఫార్ములావన్‌ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన లూయిస్‌ హామిల్టన్‌ 40 ఏళ్ల వయసులో కొత్త జట్టు ‘ఫెరారీ’ తరఫున తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్‌ కోసం ఫెరారీ జట్టుతో చేరిన హామిల్టన్‌ బుధవారం తొలిసారి ఆ టీమ్‌ ఎఫ్‌1 కారుతో డ్రైవింగ్‌ చేశాడు. టీమ్‌ ట్రాక్‌ ఫియోరానో వద్ద ఫెరారీ లోగో ఉన్న హెల్మెట్‌ ధరించి ఎస్‌ఎఫ్‌–23 కారుతో దూసుకెళ్లిన అతను పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులకు అభివాదం చేశాడు. 

హామిల్టన్‌ కోసమే ఇటాలియన్‌ ఫ్యాన్స్‌ సమీపంలోనే బ్రిడ్జ్‌ వద్ద ఎదురు చూస్తూ కనిపించారు. ఎఫ్‌1లో 12 ఏళ్ల పాటు మెర్సిడెస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్‌ ఆ జట్టు తరఫున ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు మెక్‌లారెన్‌ టీమ్‌ తరఫున కూడా మరో ప్రపంచ టైటిల్‌ నెగ్గిన అతను మొత్తం ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచి మైకేల్‌ షుమాకర్‌తో సమంగా నిలిచాడు. 

‘ఫెరారీ తరఫున బరిలో దిగేందుకు నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. అలాంటి అవకాశం వస్తుందని కొంత కాలం వరకు కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు నా కల నిజమైంది. నా కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాను. ఇప్పుడు ఈ టీమ్‌ తరఫున ఆడటం మరింత ఆనందాన్నిస్తోంది’ అని హామిల్టన్‌ వ్యాఖ్యానించాడు. 2025 ఫార్ములావన్‌ సీజన్‌ మార్చి 16న మెల్‌బోర్న్‌లో జరిగే ఆ్రస్టేలియన్‌ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)