పీసీబీ సంచలన నిర్ణయం.. స్టార్‌ క్రికెటర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Published on Thu, 12/11/2025 - 10:03

అత్యాచార ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎత్తేసింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో ఆడేందుకు అతడికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చింది. 

హైదర్‌ అలీతో పాటు మొత్తం 9 మంది ఆటగాళ్లకు పీసీబీ బుధవారం ఎన్‌ఓసీలు ఇచ్చింది. పాకిస్తాన్‌ జాతీయ జట్టు తరఫున 35 టి20లు, మూడు వన్డేలు ఆడిన హైదర్‌ అలీ... పాకిస్తాన్‌ షాహీన్స్‌ జట్టు తరఫున ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయంలో... ఇంగ్లండ్‌లో పుట్టిన పాకిస్తానీ మహిళ అతడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాంచెస్టర్‌ పోలీసులు సరైన ఆధారాలు లేని కారణంగా సెప్టెంబర్‌ 25న ఈ కేసును మూసివేశారు. దీంతో అతడిపై మోపిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హైదర్‌ అలీ బీపీఎల్‌లో ఆడేందుకు అనుమతివ్వాలని పీసీబీని కోరగా... అందుకు బోర్డు అంగీకారం తెలిపింది. 

హైదర్‌ అలీతో పాటు మొహమ్మద్‌ నవాజ్, అబ్రార్‌ అహ్మద్, సాహబ్‌జాదా ఫర్హాన్, ఫహీమ్‌ అష్రఫ్, హుసేన్‌ తలత్, ఖ్వాజా నఫా, ఎహెసానుల్లాకు పీసీబీ నిరభ్యంతర పత్రాలు ఇచ్చింది. ఇక సీనియర్‌ ప్లేయర్‌ ఉమ్రాన్‌ అక్మల్‌ అభ్యర్థనను మాత్రం బోర్డు తిరస్కరించింది.
చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మార‌న్ మాస్ట‌ర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)