Breaking News

గుకేశ్‌ బృందమిదే...

Published on Fri, 12/13/2024 - 08:15

వరల్డ్‌ ఛాంపియన్ షిప్  లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఆటగాడి సన్నాహాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో అతను కేవలం తన బుర్రకు మాత్రమే పదును పెడితే సరిపోదు. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో అనేక మంది సహాయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ట్రెయినర్లు, సెకండ్‌లు, ట్రెయినింగ్‌ పార్ట్‌నర్‌లు కూడా అతని విజయంలో భాగస్వాములే. గుకేశ్‌ టీమ్‌లో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), ఒక ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) ఉన్నారు. 

భారత ఆటగాడు, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ఇందులో కీలక సభ్యుడు. పోలాండ్‌కు చెందిన నలుగురు గ్రాండ్‌మాస్టర్లు గ్రెగొర్జ్‌ గజేస్కీ, రడొస్లావ్‌ వొజాసెక్, జాన్‌ క్రిస్టాఫ్‌ డ్యూడాలతో పాటు పోలాండ్‌కే చెందిన ఐఎం జాన్‌ క్లిమ్‌కోవ్‌స్కీ వీరిలో ఉన్నారు. జర్మన్‌ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీపర్‌ కూడా గుకేశ్‌ టీమ్‌లో సభ్యుడే. వీరితో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు మెంటల్‌ ట్రెయినర్‌ ప్యాడీ ఆప్టన్‌తో కూడా గుకేశ్‌ కలిసి పని చేయడం విశేషం. ప్యాడీ ఆప్టన్‌ 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టుతో... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో కలిసి పనిచేశారు.    

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)