Breaking News

టీమిండియా ఆట‌గాడికి గాయం.. కీల‌క టోర్నీకి దూరం

Published on Fri, 08/15/2025 - 17:19

బుచ్చిబాబు టోర్నమెంట్-2025కు టీమిండియా స్పిన్న‌ర్‌, త‌మిళ‌నాడు స్టార్ ప్లేయ‌ర్ సాయి కిషోర్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. ఈ ఎడ‌మ చేతి వాటం స్పిన్న‌ర్ చేతి వేలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు కోలుకోవ‌డానికి దాదాపు మూడు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

దీంతో ఈ ప్రతిష్టాత్మ‌క దేశ‌వాళీ టోర్నీ నుంచి సాయి కిషోర్ త‌ప్పుకొన్నాడు. కాగా ఈ టోర్నీలో సాయికిషోర్ త‌మిళ‌నాడు ప్రెసెడెంట్ ఎలెవ‌న్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించాల్సి ఉండేది. ఇప్పుడు సాయి త‌ప్పుకోవ‌డంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ప్రదోష్ రంజన్ పాల్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను సెల‌క్ట‌ర్లు అప్ప‌గించారు.

వాస్త‌వానికి రంజ‌న్ పాల్ తొలుత త‌మిళ‌నాడు జ‌ట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు త‌మిళ‌నాడు ప్రెసెడెంట్ ఎలెవ‌న్‌లోకి పాల్‌ రావ‌డంతో  షారుఖ్ ఖాన్ త‌మిళ‌నాడు ఎలెవ‌న్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. కాగా బుచ్చి బాబు టోర్నీ చెన్నై వేదిక‌గా ఆగ‌స్టు 18 నుంచి సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

సాయికిషోర్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2025 త‌ర్వాత ఈ గుజ‌రాత్ టైటాన్స్ స్పిన్న‌ర్ ఇంగ్లండ్ కౌంటీల్లో స‌ర్రే త‌ర‌పున ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. అయితే ఈ టోర్నీ మ‌ధ్య‌లోనే గాయప‌డ‌డంతో అత‌డు కేవ‌లం రెండు మ్యాచ్‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

ఐపీఎల్‌లో కూడా సాయికిషోర్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 15 మ్యాచ్‌ల‌లో 19 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆగస్టు 28 నుంచి జరిగే దులీప్‌ ట్రోఫీలో కూడా సాయి కిషోర్‌ ఆడేది అనుమానమే. అతడు సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపికయ్యాడు.
చదవండి: కాబోయే కోడలితో పూజలో సచిన్‌- అంజలి.. సారా ఫొటోలు వైరల్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)