Breaking News

వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే?

Published on Fri, 05/26/2023 - 19:20

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వర్షం కారణంగా టాస్‌ కూడా కాస్త ఆలస్యం కానుంది. మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎలిమినేటర్‌ సహా రెండు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు షెడ్యూల్‌లో ఎలాంటి రిజర్వ్‌ డే కేటాయించలేదు.

దీంతో వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు వెళుతుంది. లీగ్‌ స్టేజీలో 20 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా గుజరాత్‌ నిలవగా.. ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే రూల్‌ ప్రకారం లీగ్‌ స్టేజీలో ఏ జట్టు ఎక్కువ పాయింట్స్‌ సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలుస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది.

అయితే ఇది లాస్ట్‌ ఆప్షన్‌ మాత్రమే. దానికంటే ముందు వర్షం అంతరాయం కలిగించినప్పటికి ఐదు ఓవర్ల మ్యాచ్‌కు అవకాశమిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. ఒకవేళ భారీ వర్షం కారణంగా అది కూడా వీలు కాకపోతే ఇరుజట్లలో  లీగ్‌ స్టేజీలో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023.. లండన్‌లో కోహ్లి

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు