Breaking News

CSK Vs GT: చెన్నై ధనాధన్‌ గెలుపు 

Published on Wed, 03/27/2024 - 04:32

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోకు నిరుటి రన్నరప్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది.

శివమ్‌ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్‌ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్‌లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్‌ చహర్, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తఫిజుర్‌ తలా 2 వికెట్లు తీశారు.  

ముందు రచిన్‌... తర్వాత దూబే... 
చెన్నై ఇన్నింగ్స్‌ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్‌గా సాగింది. తొలి దశను ఓపెనర్‌ రచిన్‌ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్‌ రెండో బంతికి రషీద్‌ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్‌ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్‌వే కావడం విశేషం.

తర్వాత రహానే (12), కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌ తొలి బంతికే రహానే అవుట్‌కాగా... శివమ్‌ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్‌ ఏ బౌలర్‌కు తలొగ్గకుండా దూబే బ్యాట్‌ దంచేసింది.

మిచెల్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్‌ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. 

టైటాన్స్‌ వల్ల కాలేదు! 
కొండంత లక్ష్యం చూసే గుజరాత్‌ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్‌ప్లేలోనే కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్‌ శంకర్‌ (12), మిల్లర్‌ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్‌ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు వికెట్లు అప్పగించేశారు.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) సాహా (బి) జాన్సన్‌ 46; రచిన్‌ (స్టంప్డ్‌) సాహా (బి) రషీద్‌ ఖాన్‌ 46; రహానే (స్టంప్డ్‌) సాహా (బి) సాయికిషోర్‌ 12; దూబే (సి) శంకర్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 51; మిచెల్‌ (నాటౌట్‌) 24; సమీర్‌ రిజ్వీ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 14; జడేజా (రనౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్‌: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్‌ 2–0–27–0, రషీద్‌ ఖాన్‌ 4–0–49–2, సాయికిషోర్‌ 3–0–28–1, జాన్సన్‌ 4–0–35–1, మోహిత్‌ శర్మ 4–0–36–1. 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) తుషార్‌ (బి) దీపక్‌ 21; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్‌ 8; సాయి సుదర్శన్‌ (సి) సమీర్‌ (బి) పతిరణ 37; విజయ్‌ శంకర్‌ (సి) ధోని (బి) మిచెల్‌ 12; మిల్లర్‌ (సి) రహానే (బి) తుషార్‌ 21; అజ్మతుల్లా (సి) రచిన్‌ (బి) తుషార్‌ 11; తెవాటియా (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 6; రషీద్‌ ఖాన్‌ (సి) రచిన్‌ (బి) ముస్తఫిజుర్‌ 1; ఉమేశ్‌ (నాటౌట్‌) 10; జాన్సన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–28–2, ముస్తఫిజుర్‌ 4–0–30–2, తుషార్‌ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్‌ 2–0–18–1, పతిరణ 4–0–29–1. 

ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్‌ X ముంబై
వేదిక: హైదరాబాద్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)