Breaking News

పైరేట్స్‌పై జెయింట్స్‌ గెలుపు

Published on Wed, 10/15/2025 - 04:26

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–12)లో టాప్‌–8 స్థానాలతో ప్లే ఆఫ్స్‌ లక్ష్యంగా గుజరాత్‌ జెయింట్స్‌ శ్రమించింది. మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ 40–32 స్కోరుతో మూడు సార్లు చాంపియన్‌ అయిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఆరో నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ అయిన రెయిడర్‌ హిమాన్షు సింగ్‌ (11)  వచి్చరాగానే పాయింట్ల పనిపట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 11 సార్లు పాయింట్లతో వచ్చాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్లు మొహమ్మద్‌ రెజా (8), నితిని పన్వార్‌ (5), రెయిడింగ్‌ రాకేశ్‌ (4) రాణించడంతో గుజరాత్‌ క్రమం తప్పకుండా స్కోరు చేసింది. 

పట్నా జట్టులో రెయిడర్‌ మన్‌దీప్‌ కుమార్‌ (12) ఒంటరి పోరాటం చేశాడు. 16 సార్లు రెయిడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. రెయిడర్‌ అయాన్‌ (5), డిఫెండర్లు నవ్‌దీప్, అంకిత్‌ చెరో 4 పాయింట్లు చేసి రాణించారు. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 32–31తో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. యోధాస్‌ తరఫున రెయిడర్లు  గుమన్‌ సింగ్‌ (8), గగన్‌ గౌడ (6), డిఫెండర్‌ హితేశ్‌ (7) అదరగొట్టారు. 

తలైవాస్‌ జట్టులో కెప్టెన్  అర్జున్‌ దేశ్వాల్‌ (7), డిఫెండర్లు సాగర్‌ రాఠి (5), రోనక్‌ (4) రాణించారు. నేటి నుంచి ఈ నెల 23 తేదీ వరకు రోజూ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్‌ వారియర్స్, జైపూర్‌ పింక్‌పాంథర్స్‌తో పుణేరి పల్టన్, గుజరాత్‌ జెయంట్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)