Breaking News

ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

Published on Tue, 02/03/2026 - 05:58

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఇప్పటి వరకు మూడు సీజన్లు జరగ్గా ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు సార్లూ ఫైనల్‌కు చేరింది. అయితే దురదృష్టవశాత్తూ ప్రతీసారి ఓడి రన్నరప్‌ తో  సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఫైనల్‌ చేరాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్‌ జెయింట్స్‌ తొలి రెండు సీజన్లలో ఆఖరి స్థానానికే పరిమితం కాగా... గత ఏడాది మాత్రం రెండో స్థానంతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించినా ... అదే మ్యాచ్‌లో ఓడి ని్రష్కమించింది. ఈసారైనా ఆ దశను దాటి తొలిసారి తుది పోరుకు చేరాలని జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, గుజరాత్‌ జట్ల మధ్య ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తలపడుతుంది.   

స్పిన్నర్లు కీలకం... 
గత మూడు సీజన్లలో గ్రూప్‌ దశలో అగ్రస్థానంతో ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఈసారి కాస్త తడబాటును ప్రదర్శించిన జట్టు ఇప్పుడు ఫైనల్‌ కోసం ఎలిమినేటర్‌లో ఆడుతోంది. బ్యాటింగ్‌ పరంగా చూస్తే టాప్‌–5తో జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. 

ఓపెనర్లు లిజెల్‌ లీ, షఫాలీ వర్మ శుభారంభం అందిస్తే జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాతి బ్యాటర్లలో లారా వోల్‌వార్ట్, కెప్టెన్‌ జెమీమా, మరిజాన్‌ కాప్‌ చకచకా పరుగులు రాబట్టగలరు. అయితే టీమ్‌ ప్రధానంగా స్పిన్నర్లపై ఆధారపడుతోంది. శ్రీచరణి, స్నేహ్‌ రాణా, నందిని శర్మ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగల సమర్థులు 

సమష్టి ప్రదర్శనపై భారం... 
విదేశీ క్రికెటర్ల ప్రదర్శనతోనే తాజా సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ముందంజ వేసిందనడంలో సందేహం లేదు. ముగ్గురు ఆ్రస్టేలియన్లు కెపె్టన్‌ యాష్లీ గార్డ్‌నర్, బెత్‌ మూనీ, జార్జియా వేర్‌హామ్‌ తమ ఆటతో ప్రతీసారి ప్రభావం చూపించగా, న్యూజిలాండ్‌ సీనియర్‌ స్టార్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటింది. మరోసారి జెయింట్స్‌ ఈ ప్లేయర్లపైనే ఆధారపడుతోంది. భారత ఆటగాళ్లలో అనుష్క శర్మ మాత్రమే మూడో స్థానంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది. గుజరాత్‌ ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు గెలవగా... ఐదుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసి విజయాన్నందుకోవడం విశేషం.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)