GT Vs RR: ఆర్చర్‌ దెబ్బకు స్పీడ్‌ గన్‌కు చుక్కలు.. రెండో ఫాస్టెస్ట్‌ డెలివరీ

Published on Wed, 04/09/2025 - 20:52

ఐపీఎల్‌-2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 9) గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. మూడో ఓవర్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను (2) క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆర్చర్‌.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఓ బంతిని బుల్లెట్‌ వేగంతో సంధించాడు. 

ఈ బంతి స్పీడ్‌ గన్‌పై గంటకు 152.3 కిమీ వేగంగా రికార్డైంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇది రెండో వేగవంతమైన బంతి. ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ డెలివరీని పంజాబ్‌ పేసర్‌ లోకీ ఫెర్గూసన్‌ వేశాడు. ఫెర్గూసన్‌ నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 153.2 కిమీ వేగంతో ఓ బంతిని సంధించాడు. 

ఈ సీజన్‌ ప్రారంభం నుంచి ఆర్చర్‌ బుల్లెట్‌ వేగంతో బంతులు వేస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ  150 కిమీకుపైగా స్పీడ్‌తో బంతులు వేశాడు. పంజాబ్‌ మ్యాచ్‌లో ఆర్చర్‌ ఓ బంతిని 151.3 కిమీ వేగంతో వేశాడు. ఇది ప్రస్తుత సీజన్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ బంతిగా రికార్డైంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్చర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన బంతికి కూడా దాదాపుగా 150 కిమీ వేగంతో (147.7) వచ్చింది.

ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైనా ఆర్చర్‌ సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌ నుంచి గాడిలో పడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఆర్చర్‌ 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌ సహా 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రాయల్స్‌ గెలుపులో ఆర్చర్‌ కీలకపాత్ర పోషించాడు. 

పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆర్చర్‌ శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా పొందాడు. ప్రస్తుతం​ గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఆర్చర్‌ చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 3 ఓవర్లు వేసిన అతను కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి గిల్‌ వికెట్‌ తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌ (2) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. సాయి సుదర్శన్‌, బట్లర్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే 10 ఓవర్‌ చివరి బంతికి తీక్షణ అద్బుతమైన బంతితో బట్లర్‌ను (36) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని (59) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్‌ ఖాన్‌ (18) క్రీజ్‌లో ఉన్నాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 124/2గా ఉంది.

 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)