GT VS KKR: ఐపీఎల్‌-2023లో ఫాస్టెస్ట్‌ డెలివరీ

Published on Sun, 04/09/2023 - 17:23

ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన బంతి రికార్డైంది. అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 9) జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ లోకీ ఫెర్గూసన్‌ ఐపీఎల్‌-2023 ఫాస్టెస్ట్‌ డెలివరీ సంధించాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ బౌల్‌ చేసిన ఫెర్గూసన్‌.. గిల్‌ ఎదుర్కొన్న రెండో బంతిని గంటకు 154.1 కిమీ బుల్లెట్‌ వేగంతో సంధించాడు.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఏ బౌలర్‌ ఇంత వేగవంతమైన బంతి వేయలేదు. ఈ ఓవర్లో నిప్పులు చెరిగిన ఫెర్గూసన్‌.. తొలి బంతిని 149 కిమీ వేగంతో, మూడో బంతిని 150.15 కిమీ వేగంతో, నాలుగో బంతిని 151.4 కిమీ వేగంతో సంధించి, పేస్‌కా సుల్తాన్‌ అనిపించుకున్నాడు. అయితే ఇంత చేసినా అతనికి ఒక్క వికెట్‌ కూడా దక్కకపోగా.. ధారాళంగా (4 ఓవర్లలో 40) పరుగులు సమర్పించుకున్నాడు. 

ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్‌ గిల్‌ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌కు 3, సుయాశ్‌ శర్మకు ఓ వికెట్‌ దక్కింది. 


 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)