Breaking News

హైదరాబాద్‌ ఘన విజయం 

Published on Sun, 01/07/2024 - 04:30

దీమాపూర్‌: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్‌ భారీ విజయంతో మొదలు పెట్టింది. ‘ప్లేట్‌’ గ్రూప్‌లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్, 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో ఆట కొనసాగించిన నాగాలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే ఆలౌటైంది. ఆర్‌ఎస్‌ జగన్నాథ్‌ శ్రీనివాస్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ (5/43) ఐదు వికెట్లతో చెలరేగగా...సీవీ మిలింద్, కార్తీకేయ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో హైదరాబాద్‌కు 321 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ‘ఫాలో ఆన్‌’లో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన నాగాలాండ్‌ మళ్లీ పేలవ బ్యాటింగ్‌లో 127 పరుగులకే కుప్పకూలింది. సుమిత్‌ కుమార్‌ (62) అర్ధ సెంచరీ సాధించాడు. సీవీ మిలింద్‌ 4 వికెట్లు పడగొట్టగా, తనయ్‌ త్యాగరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి.  

ఆంధ్ర 119/3 
విశాఖ స్పోర్ట్స్‌: బెంగాల్‌తో జరుగుతున్న ‘ఎలైట్‌’ డివిజన్‌ రంజీ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రశాంత్‌ కుమార్‌ (41), సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (33), షేక్‌ రషీద్‌ (32) వెనుదిరగ్గా...కెప్టెన్ హనుమ విహారి (6 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 289/4తో ఆట కొనసాగించిన బెంగాల్‌ 409 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ పొరేల్‌ (70) హాఫ్‌ సెంచరీ చేయగా, లలిత్‌ మోహన్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆంధ్ర మరో 290 పరుగులు వెనుకబడి ఉంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)