అల్‌కరాజ్‌ అవుట్‌

Published on Sat, 08/31/2024 - 03:27

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం పెను సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్‌ అల్‌కరాజ్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అల్‌కరాజ్‌ను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రపంచ 74వ ర్యాంకర్‌ బోటిక్‌ వాన్‌ డె జాండ్‌షుల్ప్‌ వరుస సెట్‌లలో ఓడించి తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. 

2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోటిక్‌ 6–1, 7–5, 6–4తో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. యూఎస్‌ ఓపెన్‌లో అల్‌కరాజ్‌  రెండో రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం. 2021లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన అతను, 2022లో ఏకంగా విజేతగా అవతరించాడు. 2023లో అల్‌కరాజ్‌ సెమీఫైనల్లో ని్రష్కమించాడు.

 అల్‌కరాజ్‌తో మ్యాచ్‌లో బోటిక్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 22 విన్నర్స్‌ కొట్టిన బోటిక్‌ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అల్‌కరాజ్‌ 27 అనవసర తప్పిదాలు చేశాడు. ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), పదో సీడ్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా... 16వ సీడ్‌ సెబాస్టియన్‌ కోర్డా (అమెరికా) రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)