Breaking News

70వ ప్రయత్నంలో ఒకరు... 52వ ప్రయత్నంలో మరొకరు

Published on Mon, 06/09/2025 - 01:57

పారిస్‌: పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే... ఎట్టకేలకు తమ గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌ కలను నెరవేర్చుకున్నారు మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌), హొరాసియో జెబలాస్‌ (అర్జెంటీనా). గెలవాలన్న కసి ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని వీరిద్దరూ నిరూపించారు. 39 ఏళ్ల గ్రానోలెర్స్‌ 2007 నుంచి... 40 ఏళ్ల జెబలాస్‌ 2009 నుంచి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో పోటీపడుతున్నారు. చివరకు ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వీరిద్దరి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ స్వప్నం సాకారమైంది. 

భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ గ్రానోలెర్స్‌–జెబలాస్‌ ద్వయం 6–0, 6–7 (5/7), 7–5తో ఎనిమిదో సీడ్‌ జో సాలిస్‌బరీ–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంటను ఓడించి తమ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకుంది. తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌కంటే ముందు గ్రానోలెర్స్‌ 69 సార్లు... జెబలాస్‌ 51 సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీనల్లో బరిలోకి దిగారు. 

గతంలో గ్రానోలెర్స్‌... వింబుల్డన్‌ (2023, 2021), యూఎస్‌ ఓపెన్‌ (2019, 2014), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2014)లలో... జెబలాస్‌... వింబుల్డన్‌ (2023, 2021), యూఎస్‌ ఓపెన్‌ (2019)లలో ఫైనల్‌ చేరినా చివరకు రన్నరప్‌ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం విజేతలుగా అవతరించి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. చాంపియన్‌గా నిలిచిన గ్రానోలెర్స్‌–జెబలాస్‌ జోడీకి 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీగా 
లభించింది.

మహిళల డబుల్స్‌ విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ జోడీ జాస్మిన్‌ పావోలిని–సారా ఎరాని (ఇటలీ) టైటిల్‌ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పావోలిని–సారా ఎరాని ద్వయం 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్‌)–అలెగ్జాండ్రా క్రునిక్‌ (సెర్బియా) జంటను ఓడించింది. 

సారా ఎరానికిది ఆరో గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌. రొబెర్టా విన్సీ (ఇటలీ)తో కలిసి సారా ఎరాని గతంలో యూఎస్‌ ఓపెన్, వింబుల్డన్, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ సారా ఎరాని ఇటలీకే చెందిన ఆండ్రియా వావసోరితో జతకట్టి టైటిల్‌ గెలిచింది. మహిళల డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన పావోలిని–సారా ఎరాని ఖాతాలో 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్‌మనీగా చేరాయి.

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)